యాదగిరిగుట్ట నిత్య ఆదాయం పతనం: భారీగా తగ్గిన భక్తుల రద్దీ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు మంగళవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. వివిధ విభాగాల నుంచి మొత్తం రూ.7,84,620 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. ప్రసాదాలు, వీఐపీ దర్శనాలు, కార్ పార్కింగ్ ద్వారా ఈ మొత్తం వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. భక్తుల రాక తగ్గడంతో ఆలయ ప్రాంగణం వెలవెలబోయింది.