దేశ రక్షణే లక్ష్యం: వాయుసేన చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన ఆశుతోష్ దీక్షిత్

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

భారత వాయుసేన 29వ చీఫ్ గా ఆశుతోష్ దీక్షిత్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. దేశ భద్రతకు ఎలాంటి ముప్పు ఎదురైనా క్షణాల్ లో స్పందించేలా వాయుసేనను సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. వాయుసేనను మరింత బలోపేతం చేసేందుకు విజిలెన్స్, ఆత్మనిర్భరత, యుక్తి, త్రివిధ దళాల సమన్వయం అనే నాలుగు ప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆశుతోష్ దీక్షిత్ వెల్లడించారు.