అద్భుత ప్రతిభ: గిన్నిస్ రికార్డు సృష్టించిన పదిహేనేళ్ల బాలుడు
రిపోర్టర్: నరేష్
స్థలం: London
బ్రిటన్స్ గాట్ టాలెంట్ వేదికపై తన మ్యాజిక్ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచిన పదిహేనేళ్ల ఐర్లాండ్ బాలుడు సిలియన్ ఓ కాన్నర్ గిన్నిస్ రికార్డు సాధించాడని గిన్నిస్ రికార్డ్స్ నిర్వాహకులు తెలిపారు. కేవలం అరవై సెకన్లలో ముప్పై ఐదు విజయవంతమైన మ్యాజిక్ ట్రిక్స్ ప్రదర్శించి ఈ ఘనత సాధించినట్లు వెల్లడించారు. బాల్యంలో చిన్న మ్యాజిక్ చూసి భయపడిన తాను, నేడు ప్రపంచ స్థాయి ఇంద్రజాలికుడిగా ఎదిగి ఇతర పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్నట్లు ఓ కాన్నర్ పేర్కొన్నారు.