లక్సెట్టిపేట మున్సిపాలిటీలో రూ. 45 లక్షలతో సిసి రోడ్ల పనులకు భూమిపూజ
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: లక్సెట్టిపేట
లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య తెలిపారు. శనివారం వివిధ వార్డులలో రూ. 45 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఆమె స్థానిక కౌన్సిలర్లతో కలిసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు.