స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పురస్కారాలు: నెల్లూరు నగరపాలక సంస్థకు దక్కిన మూడు అవార్డులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Nellore
ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల్లో నెల్లూరు నగరపాలక సంస్థ విశేష ప్రతిభ కనబరిచి మూడు పురస్కారాలను దక్కించుకుంది. వాయు నాణ్యత పరిరక్షణ విభాగంలో ప్రత్యేక పురస్కారం లభించింది. విజయవాడలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ అలాగే అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. స్వచ్ఛ పాఠశాలలు, పార్కులు, వాణిజ్య సముదాయాల విభాగాల్లోనూ పలు సంస్థలు ఈ అవార్డులను కైవసం చేసుకున్నాయని అధికారులు తెలిపారు.