భూ వివాదాల పరిష్కారానికి జాయింట్ సర్వేే శరణ్యం: మంత్రి పొంగులేటి
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
రెవెన్యూ, అటవీ శాఖల భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివతలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ, జాయింట్ సర్వే ద్వారానే సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయన్నారు. సరిహద్దు వివాదాల వల్ల రైతులు ఏమాత్రం నష్టపోకూడదని, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి క్షేత్రస్థాయిలో సంయుక్త సర్వేలు నిర్వహించి స్పష్టమైన హద్దులను నిర్ధారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.