రాప్తాడు బాలికపై కిరాతక దాడి నిందితుడు హేమంత్ పై పోలీసుల కాల్పులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు తిరగబడ్డాడని, ఈ క్రమంలో ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ దారుణ ఘటనలో గాయపడిన బాలిక గోపికకు బెంగళూరులో వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.