విదేశాలకు వెళ్లే విద్యార్థులు మూలాలు మరువొద్దు: డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ బినయ్ కుమార్ దాస్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూఢిల్లీ

విదేశాలకు విద్య కోసం వెళ్లే యువత తమ దేశ సాంస్కృతిక మూలాలను ఎప్పటికీ మరువకూడదని డీఆర్డీఓ డైరెక్టర్ జనరల్ బినయ్ కుమార్ దాస్ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఐఐటీలో శనివారం జరిగిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విదేశాల్లో కేవలం డాలర్లు సంపాదించడం కోసం మాత్రమే కాకుండా, భారతదేశ రాయబారులుగా వెళ్లాలని సూచించారు. విద్యనభ్యసించిన అనంతరం మాతృదేశానికి తిరిగి వచ్చి దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.