గురుపూజోత్సవం వేళ విజయనగరం జిల్లా అధ్యాపకులకు రాష్ట్రస్థాయి పురస్కారాలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయనగరం
గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ అధ్యాపక పురస్కారాల్లో విజయనగరం జిల్లాకు చెందిన జి.సత్యనారాయణ, పాండ్రింకి గురుమూర్తి ఎంపికయ్యారు. సాంకేతిక విద్యలో సత్యనారాయణ, తెలుగు బోధనలో గురుమూర్తి తమ ప్రతిభతో ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. శనివారం విజయవాడలో వీరు పురస్కారాలు అందుకోనున్నారు. అలాగే పార్వతీపురంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికై అరుదైన ఘనత సాధించారు.