'అయోధ్య నుంచి తిరుమలకు.. అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం': ఉత్తరప్రదేశ్ సీఎం యోగి తిరుమల పర్యటన

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Tirumala

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అయోధ్యలోని శ్రీరాముని పవిత్ర భూమి నుండి తిరుమల దివ్య పుణ్యక్షేత్రం వరకు మన దేశ సాంస్కృతిక వారసత్వం ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని, ఇది మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తోందని పలువురు నేతలు కొనియాడారు.