తిరుమలలో రెండో రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు
రిపోర్టర్: శివ
స్థలం: తిరుపతి
తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్, రిలయన్స్, భారత్ బయోటెక్ ఈవీ బస్సులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆధునికీకరించిన ఎస్వీ మ్యూజియాన్ని ప్రారంభించి, శ్రీవారి ఆభరణాలు, త్రీడీ మోడల్స్, ఏఐ వీడియో ప్రదర్శనను పరిశీలించారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.