ఎప్స్టీన్ ఫైల్స్ కలకలం: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిపై విపక్షాల నిలదీత

రిపోర్టర్: సునీల్ స్థలం: New Delhi

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వివాదాస్పద లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగింది. ఈ అంశంపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల నేతలు స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము ఎప్పుడూ ఒంటరిగా కలవలేదన్న మంత్రి గత వాదనలు అబద్ధమని ప్రతిపక్షాలు ఆరోపించాయి.