హైదరాబాద్ లో పికో టెక్నాలజీ కార్యాలయం ప్రారంభం: మంత్రి శ్రీధర్బాబు కీలక ప్రకటన

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

హైదరాబాద్ను గ్లోబల్ వాల్యూ క్రియేషన్ కు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. హైటెక్ సిటీలో పికో టెక్నాలజీ ఇండియా కార్యాలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో వంద కొత్త జీసీసీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, స్థానిక యువతకు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.