సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నూతన అధ్యక్షుడిగా మన్దీప్ కే భండారి
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి సీబీఎస్ఈ నూతన అధ్యక్షుడిగా 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మన్దీప్ కే భండారి నియమితులయ్యారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఇటీవల పరీక్షా పత్రాల డిజిటల్ మూల్యాంకన విధానంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పదవిని అదనపు కార్యదర్శి హోదాకు తాత్కాలికంగా పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.