రష్యా ఇంధన దిగుమతులపై నూ శాతం టారిఫ్ బిల్లుపై ట్రంప్ సంతకం
రిపోర్టర్: రాజేష్
స్థలం: అమెరికా
రష్యా ఆర్థిక వనరులను దెబ్బతీసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కీలకమైన ఆంక్షల బిల్లుపై సంతకం చేశారు. రష్యా నుంచి క్రూడ్ ఆయిల్, సహజ వాయువు దిగుమతి చేసుకునే దేశాలపై అత్యధికంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారాన్ని ఈ బిల్లు వైట్‌హౌస్‌కు కల్పిస్తుంది. ఉక్రైన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు లభించే ఇంధన ఆదాయాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా వైట్‌హౌస్ ఈ కఠిన చర్యకు పూనుకుంది. చైనా, భారత్‌తో పాటు మరికొన్ని ప్రముఖ దేశాలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.