స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు: దూసుకెళ్తున్న సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభ ట్రేడింగ్ లో భారీ లాభాలతో దూసుకుపోయాయని ఆర్థిక నిపుణులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో బాటు మదుపర్ల కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు పరుగులు తీశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రారంభ సెషన్లోనే 614.66 పాయింట్లు పెరిగి 76,301 పాయింట్లకు చేరగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 149.80 పాయింట్ల లాభంతో 23,588 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.