మెదక్ జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహణ
రిపోర్టర్: రమేష్
స్థలం: మెదక్
మెదక్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించినట్లు ఎంపీ ఎం. రఘునందన్ రావు వెల్లడించారు. మెదక్ జిల్లాలో కొనసాగుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల ప్రగతిని ఈ సమావేశంలో సమీక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.