దేశంలో భారీగా తగ్గిన పేదరికం: ఎన్డీఏ పాలనలో అపూర్వ మైలురాయి

రిపోర్టర్: హరి స్థలం: హైదరాబాద్

గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో అసమానతలు, పేదరికము ఇరవై ఏడు శాతం నుంచి రెండు పాయింట్ ఆరు శాతానికి రికార్డు స్థాయిలో తగ్గిపోయాయని G Kishan Reddy వెల్లడించారు. ఆధునిక భారత దేశ చరిత్రలో ఇదొక చారిత్రక మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. మోదీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతోనే ఈ అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని తెలిపారు.