ది ప్యారడైజ్ మూవీ విశేషాలు వెల్లడించిన నాని
రిపోర్టర్: అశోక్
స్థలం: తెలంగాణ
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ది ప్యారడైజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాలో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు తల్లీకొడుకుల మధ్య సాగే బలమైన భావోద్వేగాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలిపారు. ఈ సినిమా కథా అవసరాల కోసం తాను ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ సాధించడంతో పాటు విభిన్నమైన లుక్ కోసం జడలు కూడా వేసుకున్నానని నాని వివరించారు.