ప్రభాస్ సినిమా టికెట్ దొరకలేదని ఏకంగా థియేటర్ కొనుగోలు చేసిన అభిమాని

రిపోర్టర్: కృష్ణ స్థలం: అనకాపల్లి

అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త, నిర్మాత కాండ్రేగుల నాయుడు తనకు ప్రభాస్పై ఉన్న అభిమానం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ నటించిన మిర్చి సినిమా విడుదల సమయంలో కుటుంబంతో కలిసి వెళ్లగా టికెట్లు దొరకలేదని ఆయన తెలిపారు. ఆ సమయంలో ఏర్పడిన పట్టుదలతోనే అనకాపల్లిలోని వెంకటేశ్వర థియేటర్ను తాను కొనుగోలు చేసినట్లు నాయుడు స్పష్టం చేశారు. ఇప్పుడు తాను నిర్మించిన అనకాపల్లి సినిమాను అదే థియేటర్లో విడుదల చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.