జోస్యం తప్పిందంటూ వృద్ధ పూజారిని కాల్చి చంపిన తండ్రీకొడుకులు

రిపోర్టర్: సురేష్ స్థలం: ముజఫర్‌నగర్

కొడుకు పుడతాడని చెప్పిన జోస్యం తప్పడంతో ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో వృద్ధ పూజారి దేవానంద్ భారతిని తండ్రీకొడుకులు హషీమ్, జీషన్లు కాల్చి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ 13న శివాలయంలో అర్చకుడిగా ఉన్న వృద్ధుడిని హత్య చేసి, తమ పాత శత్రువు హరేంద్రను ఇరికించేందుకు నిందితులు కుట్ర పన్నారని తెలిపారు. సాంకేతిక దర్యాప్తు ద్వారా అసలు నిజం గుర్తించిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.