విశాఖ గీతం వర్సిటీలో 5జీ యూజ్ కేస్ ల్యాబ్ ద్వారా సాంకేతిక ప్రయోగాలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన 5జీ యూజ్ కేస్ ల్యాబ్‌లో విద్యార్థులు అత్యాధునిక సాంకేతిక ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన వంద ఉన్నత విద్యాసంస్థల్లో ఈ ల్యాబ్‌లను నెలకొల్పగా, భవిష్యత్తు అవసరాలైన 6జీ టెక్నాలజీకి ఇవి పునాది వేస్తున్నాయి. ఏఐ, ఐఓటీ సాంకేతికతలను ఉపయోగించి వ్యవసాయంలో పంట తెగుళ్లను గుర్తించే స్మార్ట్ అటానమస్ డ్రోన్లను విద్యార్థులు అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర టెలికాం ప్రత్యేక డైరెక్టర్ జనరల్ దీపా అరోరా తెలిపారు.