ఆమనగల్లు శ్రీకాంత్ కాలనీలో నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యమన్న చైర్మన్
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీకాంత్ కాలనీలో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్ ఆధ్వర్యంలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్ పరిశీలించారు. ఈ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కాలనీ వాసుల సమస్యలను పరిష్కరిస్తూ మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.