హింజేవాడి మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్: 19.2 కిమీ రోడ్ల అభివృద్ధి

రిపోర్టర్: హరి స్థలం: Pune

పూణెలోని హింజేవాడి మెట్రో ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని పీఎంఆర్డీఏ కమిషనర్ అభిజిత్ చౌధరి తెలిపారు. మొదటి దశలో ప్రారంభంకానున్న 12 మెట్రో స్టేషన్లలో ఎనిమిది ప్రాంతాలను ఎంపిక చేసి దాదాపు 19.2 కిలోమీటర్ల మేకు లాస్ట్-మైల్ కనెక్టివిటీ రోడ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఎంఐడీసీ మరియు పీఎంఆర్డీఏ సంయుక్తంగా ఈ రోడ్ల నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.