ఏఎల్పురంలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన కనకలక్ష్మి
రిపోర్టర్: Nelluri Chiranjeevi
స్థలం: గొలుగొండ
గొలుగొండ మండలం ఏఎల్పురం రెండో సెగ్మెంట్ నుంచి కూటమి అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న యర్రంశెట్టి వెంకట కనకలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆమె వివరించారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలంటే తనకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.