స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై సీఎం రేవంత్ ఆగ్రహం

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది సభకు, దళిత సామాజిక వర్గానికి జరిగిన అవమానమన్నారు. ఈ వ్యవహారంపై కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సభ్యుడితో తక్షణమే రాజీనామా చేయించాలని, సభ్యత్వం రద్దు చేయాలని శాసన మండలి చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.