ఇజ్రాయెల్ సంస్థతో భేటీపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై ఆగ్రహం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఇస్లామాబాద్

బ్రిటన్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇజ్రాయెల్ అనుకూల ఆర్థిక సంస్థ ప్రతినిధులతో సమావేశం కావడంపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలస్తీనాలోని యూదుల నివాస ప్రాంతాలతో సంబంధాలున్న రోత్ షీల్డ్ కంపెనీ అధికారులతో ఆయన భేటీ కావడాన్ని పాకిస్థానీలు తప్పుబడుతున్నారు. నిధుల కోసం యూదు సంస్థను ఆశ్రయించడం దారుణమని సామాజిక మాధ్యమాలలో మండిపడుతున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ ను యూదు ఏజెంటంటూ విమర్శించిన నేతలు ఇప్పుడు ఏ సమాధానం చెబుతారని పీటీఐ నేతలు నిలదీస్తున్నట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి.