వైయనాడులో రిపోర్టర్ ఛానల్ ఎండీ ఆంటో అగస్టిన్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

రిపోర్టర్: రాజేష్ స్థలం: వయనాడ్

కేరళలోని సుల్తాన్ బతేరిలో మలయాళ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆంటో అగస్టిన్ బెయిల్ పిటిషన్‌ను స్థానిక కోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఆయన పూర్వీకుల ఇంట్లో అనుమతికి మించి అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో ఎక్సైజ్ శాఖ ఈ కేసు నమోదు చేసింది. ఫుట్‌బాల్ ఈవెంట్ అవకతవకలపై దర్యాప్తు జరుపుతున్న సిట్ బృందం ఇచ్చిన సమాచారంతో ఆంటో అగస్టిన్‌ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.