రాహుల్, కేటీఆర్లపై ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆదిలాబాద్

దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా రాహుల్ గాంధీ, కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ ఆరోపించారు. విదేశీ వేదికలపై భారతదేశ పరువును బజారున పడేసేలా వారి వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. ప్రపంచ దేశాల ముందు దేశాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. జాతీయ భద్రతను విస్మరించి రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ గోడం నగేశ్ స్పష్టం చేశారు.