స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం: కూటమి అభ్యర్థుల భారీ గెలుపునకు పిలుపు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: అమరావతి

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పించేలా కసరత్తు చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో మంత్రులు, నేతలతో వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీ పూర్తిగా మూతపడేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.