హైదరాబాద్ లో అమిత్ షా నేతృత్వంలో మహా పాదయాత్ర: భారీగా తరలిరావాలని కిషన్ రెడ్డి పిలుపు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ప్రతిష్టాత్మక మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ప్రజాస్వామ్యం, జాతీయ అభివృద్ధి కోసం అంతా ఐక్యంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పౌరులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశ రక్షణను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ జీ కిషన్ రెడ్డి ఎక్స్ వేదికగా ఈ ప్రకటన చేశారు.