ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై పశ్చాత్తాపం వ్యక్తంచేసిన మాజీ సీఎం జగన్
రిపోర్టర్: సతీష్
స్థలం: Tadepalli
కేంద్రంలో ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియకు అప్పట్లో మద్దతిచ్చి తప్పు చేశామని, ఇప్పుడు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఆదివారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని, కేంద్ర మంత్రులకే మెజారిటీ ఉండే ఈ నియామక విధానంలో మార్పులు రావాలని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ద్వారానే ఎంపిక జరగాలని జగన్ స్పష్టం చేశారు.