రెండు భాగాలుగా అల్లు అర్జున్ రాకా సినిమా విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న రాకా సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మాస్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కథా పరిధి పెద్దదిగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలి భాగం డిసెంబర్ 2027లో, రెండో భాగం 2028లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై సన్ పిక్చర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.