యెమెన్‌లో హూతీలపై సౌదీ అరేబియా భారీ వైమానిక దాడి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: World
యెమెన్‌లో వ్యూహాత్మక ప్రాంతాలను హూతీలు కైవసం చేసుకున్న నేపథ్యంలో సౌదీ అరేబియా భీకర దాడికి దిగింది. ఏడు ప్రావిన్సులపై కేవలం 48 గంటల్లోనే 129 సార్లు యుద్ధ విమానాలతో వైమానిక దాడులు జరిపింది. ఎర్రసముద్ర మార్గంలో హూతీల ఆధిపత్య ప్రయత్నాలను అడ్డుకునేందుకు సౌదీ ఈ దాడులు చేపట్టింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ వాణిజ్య మార్గంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.