మహిళల ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని వైద్యుల హెచ్చరిక
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
మహిళలు తమ శరీరంలో కనిపించే అనారోగ్య లక్షణాలను ఎప్పుడూ సాధారణ విషయాలుగా తేలికగా తీసుకోకూడదని అపోలో అథెనా ఉమెన్స్ క్యాన్సర్ సెంటర్ మెడికల్ ఆంకాలజీ లీడ్ డాక్టర్ రూపేందర్ సేఖాన్ స్పష్టం చేశారు. అధిక రక్తస్రావం, దీర్ఘకాలిక కడుపు ఉబ్బరం, పెల్విక్ నొప్పులను నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొత్తగా ఎదురయ్యే ఎలాంటి మార్పులనైనా వెంటనే వైద్యుల వద్ద పరీక్షించుకోవాలని ఆమె సూచించారు.