పంటల రక్షణకై విద్యుత్ అధికారులను నిలదీసిన అన్నదాతల ఆక్రోశ గర్జన

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

నేలకొండపల్లి మండలంలో విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేలకొండపల్లి అధ్యక్షుడు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కొత్తూరు విద్యుత్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు వినతిపత్రం అందజేసి, రైతుల పంటలకు నష్టం వాటిల్లకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా కోరారు.