యూట్యూబర్ జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్‌కు ఏడు రోజుల పోలీసు కస్టడీ
రిపోర్టర్: విజయ్
స్థలం: గన్నవరం
యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ ఎలియాస్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. స్థానిక అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ నెల 18 నుంచి 24 వరకు పలు షరతులు విధిస్తూ కస్టడీకి అనుమతించింది. 24వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా కస్టడీ పూర్తిచేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది.