లక్నోలో వ్యాపారి శివ శర్మ మృతి కేసు: పరారీలో మోడల్ శ్రద్ధా దూబే
రిపోర్టర్: మహేష్
స్థలం: Lucknow
లక్నోలో వ్యాపారి శివ శర్మ మృతి కేసులో దర్యాప్తు ముమ్మరమైందని, ప్రధాన నిందితురాలైన మోడల్ శ్రద్ధా దూబే నేపాల్‌కు పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అక్టోబర్ తొమ్మిదవ తేదీన నాలుగో అంతస్తు నుంచి కిందపడి శివ శర్మ మృతి చెందారని పోలీసులు తెలిపారు. శ్రద్ధా దూబే తన సహచరులతో కలిసి నేపాల్ వైపు వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు లభ్యమయ్యాయని, మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అధికారులు పేర్కొన్నారు.