మందాడి విజయానందంలో రజనీకాంత్ ఫోన్ కాల్ ను గుర్తు చేసుకున్న నటుడు సూరి

రిపోర్టర్: రాము స్థలం: చెన్నై

మందాడి చిత్రం ఘనవిజయం సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో నటుడు సూరి తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు ఫోన్ చేసి సినిమాలోని సముద్ర నేపథ్య యాక్షన్ సన్నివేశాలను, నటనను అభినందించిన విషయాన్ని సూరి గుర్తుచేసుకుంటూ ఆయన గొంతును అనుకరించి అలరించారు. దర్శకుడు వెట్రిమారన్ కూడా సూరి ప్రయాణాన్ని కొనియాడారు.