హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సంచలన నిర్ణయం: భారత ఐటీ రంగానికి భారీ షాక్
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
అమెరికాలో ఉపాధి అనుమతి పత్రాల ఆటోమేటిక్ పొడిగింపు విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తుది నిబంధనలు జారీ చేసిందని బ్లూమ్‌బెర్గ్ లా పేర్కొంది. ఈ నిర్ణయంతో భారతీయ ఐటీ రంగానికి చెందిన హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వలసదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.