శ్రీవారి బ్రహ్మోత్సవ సేవకులకు వేమిరెడ్డి దంపతుల వస్త్ర బహుమానం

రిపోర్టర్: శివ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖులు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ సేవకుల కోసం ఉదారత చాటుకున్నారు. దాదాపు ఐదు వేల మంది టీటీడీ సిబ్బందికి వేమిరెడ్డి దంపతులు వస్త్రాలను పంపిణీ చేశారు. గత ఎనిమిదేళ్లుగా నిరంతరాయంగా ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సేవకుల పట్ల వారి నిబద్ధతపై భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.