గంట్యాడ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా గంట్యాడ బీసీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని గదులు, మరుగుదొడ్లు, వంటశాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుద్ధమైన తాగునీరు అందేలా ఆర్వో ప్లాంట్ను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వసతి గృహాల్లో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని సిబ్బందికి ఆయన స్పష్టం చేశారు.