దేశంలో విష ప్రచారాల వెనుక విదేశీ నిధులు: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

దేశంలో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్న పలువురి వెనుక భారత్ వ్యతిరేక శక్తులు, విదేశీ నిధులు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విదేశీ నిధులతో నడిచే స్వచ్ఛంద సంస్థలు, డీప్ స్టేట్ ఆపరేటివ్స్ కుమ్మక్కై దేశంలో వ్యవస్థలపై కుట్రపూరిత కథనాలు వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిధుల ప్రవాహాన్ని అరికట్టడానికి అత్యంత అవసరమని మంత్రి స్పష్టం చేశారు.