బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఇంటిపై పోలీసులు అక్రమ దాడి

రిపోర్టర్: నరేష్ స్థలం: తెలంగాణ

మాజీ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు క్రిశాంక్ ఇంటి గేట్ తలుపులు పగులగొట్టి పోలీసులు అక్రమంగా ఇంట్లోకి చొరబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే ఇంతటి అరాచకమా అంటూ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న వారిపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.