పట్టణంలో కాలువ పనులను పరిశీలించి అడ్డంకులను తొలగించిన నాయకులు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లి పట్టణంలోని 19వ వార్డులో జరుగుతున్న కాలువ పనులను కౌన్సిలర్ సిమ్రాన్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు ఖలీం పరిశీలించారు. కాలువ నిర్మాణ పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. నూతన కాలువ నిర్మాణానికి అడ్డుగా ఉన్న జియో పోల్ను గుర్తించి, జియో మేనేజర్తో మాట్లాడి తన సమక్షంలోనే పోల్ను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. కాలువ నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.