వృద్ధుల సంక్షేమ చట్టాలపై పోస్టర్లను ఆవిష్కరించిన ఆసిఫాబాద్ కలెక్టర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం-2007, నియమావళి-2011 మరియు నేరశిక్షా నియమావళికి సంబంధించిన గోడపత్రాలు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ చట్టం ద్వారా వృద్ధులకు లభించే రక్షణ, హక్కులు, మరియు వారి సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ నిబంధనల గురించి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. వృద్ధుల సంరక్షణ ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు.