అణ్వాయుధం తయారు చేసే ఉద్దేశం తమకు లేదంటూ ఇరాన్ అధ్యక్షుడు స్పష్టీకరణ

రిపోర్టర్: సతీష్ స్థలం: టెహ్రాన్

అణ్వాయుధం తయారు చేసే ఉద్దేశం తమకు లేదని, అణుకేంద్రాలను తనిఖీ చేసుకునేందుకు అంతర్జాతీయ సంస్థలను అనుమతిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. ఎలాంటి కారణం లేకుండా అమెరికా తమ దేశంపై దాడులకు దిగుతోందని, యుద్ధాన్ని ముగించాలా వద్దా అనేది అమెరికా చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. తమ దేశ మనుగడ కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా భరిస్తామని, ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటూనే ముందుకు సాగుతామని ఆయన వెల్లడించారు.