మంత్రి పదవి ఇవ్వలేదంటూ రేవంత్ సర్కార్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్
రిపోర్టర్: రాజేష్
స్థలం: నల్గొండ
తెలంగాణ రాజకీయాల్ లో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. తనకు మంత్రి పదవి ఇస్తామని ఇచ్చిన హామీని ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వద్దకు మనసు చంపుకొని వెళ్లాల్సి వచ్చిందని, రాష్ట్రంలో లంచాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.