బీసీ యువతకు ఏపీ ప్రభుత్వం రూ.7.92 కోట్ల నిధులు విడుదల

రిపోర్టర్: వెంకట్ స్థలం: Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ యువత ఒక్క రూపాయి కూడా సొంత పెట్టుబడి పెట్టకుండా జనరిక్ మందుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా రూ.7.92 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 198 జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటుకు ఒక్కో యూనిట్‌కు రూ.8 లక్షల చొప్పున సబ్సిడీ మరియు లోన్ అందించనున్నారు.