ఢిల్లీవరీ సేవలు అత్యంత చెత్తగా ఉన్నాయంటూ ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ మండిపాటు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: New Delhi
ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ లాజిస్టిక్స్ సంస్థ ఢిల్లీవరీ సేవలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా తన సమస్యకు ఎలాంటి పరిష్కారం దక్కలేదని ఆరోపించారు. కస్టమర్ సపోర్ట్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన నిరాశను పంచుకుంటూ, ఇతర వ్యాపార సంస్థలు ఈ డెలివరీ భాగస్వామిని ఎంచుకోవద్దని హెచ్చరించారు. ఈ ఘటనపై నెటిజన్లు సైతం తమ అనుభవాలను పంచుకుంటూ స్పందిస్తున్నారు.